2443) మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు

** TELUGU LYRICS **    

    మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు
    నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ

1.  భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు
    దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ

2.  విజయము మరణపు వేదనపై నొందఁగా
    విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ

3.  నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు
    దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ

4.  నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు
    కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ

5.  దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన
    సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ

6.  నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు
    నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ

7.  నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము
    నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ

8.  దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము
    ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ

9.  నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా
    పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ

10.ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము
    ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ

11.నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపైఁ జూపుము
    మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ

** ENGLISH LYRICS **

Maa Yesu Kreestu Neeve Mahimagala Raajavu Neevu
Neeve Thandriki Nithya Kumaarudavu O Kreestu

1. Bhoonarulan Rakshimpa Poonukoninappudu
Dheena Kanyaagarbhamun Dhiraskarimpalethugaa O Kreestu

2. Vijayamu Maranapu Vedhanapai Nondagaa
Vishwaasulandharikin Vippithivi Mokshamun O Kreestu

3. Neevu Thandridhainatti Nithya Mahimayandhu
Devuni Kudivaipu Dhiramugaa Goorchunnaavu O Kreestu

4. Neevu Nyaayaadhipathivai Nishchayamugaa Vachchedhavu
Kaavuna Nee Saayambu Kaanimmu Nee Daasulaku O Kreestu

5. Divyamau Rakthambu Chindhinchi Neevu Rakshinchina
Sevakulakai Memu Cheyu Manavi Naalinchu O Kreestu

6. Nee Vaari Nellappudunu Nithya Mahimayandhu
Nee Parishuddhulathonu Nee Venchukonumayya O Kreestu

7. Needhu Janamun Rakshinchi Nee Dhaayamu Deevinchumu
Naadha Vaaralanu Neali Levaneththu Meppudunu O Kreestu

8. Dhina Dhinamunu Ninnu Mahima Parchuchunnaamu
Ghanamugaa Nee Naamamun Goppacheyuchunnaamu O Kreestu

9. Nedu Paapamu Cheyakunda Nenarutho Mamu Gaavumayyaa
Paadedi Nee Daasulaku Parama Dhaya Nimmayya O Kreestu

10. Prabhuvaa Karuninchumu Prabhuvaa Karuninchumu
Praarthinchu Nee Daasulapai Vraalanimmu Deevenalan O Kreestu

11. Ninnu Nammi Yunnaamu Nee Krupa Maapai Choopumu
Memu Mosapokunda Neeve Kaapaadumayya O Kreestu

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------