2444) మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా

** TELUGU LYRICS **

    మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షా
    నగమ నెక్కెను రా 
    ||మా యేసు||

1.  ముందు నాలో పాప ములు జూడఁ బడెరా డెందము తా నన్ని టిని
    నొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మఁ జెందెనురా సందేహములు
    వీడు జాడఁ గన్గొనెరా
    ||మా యేసు||

2.  సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటు
    వీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగు
    వేల్పు ల్విష మైరిగదా
    ||మా యేసు||

3.  బాధగురువుల మోము ల్బహు లజ్జఁబడెరా గాధ మంత్రము లన్ని
    కడగండ్లయి చెడెరా శోధించి నాయాత్మ శుద్ధిగోరెనురా సాధించి
    ప్రభుక్రీస్తు శరణుఁ జొచ్చెనురా
    ||మా యేసు||

4.  మతిలోని లోఁతు మ ర్మము గానఁబడెరా మితలేని ఘనపాప మే
    నిండు కొనెరా హితముగా తన జీవ మిచ్చె క్రీస్తుఁడురా మృతిచేత మన
    పాప వితతి గొట్టెనురా
    ||మా యేసు||

5.  కులగోత్రముల బుద్ధి కుటిలంబుఁ దెగెరా బలవత్పిశాచ శృం ఖలము
    విఱిగెనురా సిలువ మోసినవాని చిర సౌఖ్యోన్నతిరా నెలవుగ నాలోన
    నిలచి యున్నదిరా
    ||మా యేసు||

6.  తనపోల్కె నొరులఁ గ న్గొనఁ బ్రేమయ్యెనురా మనసు దేవునికి న
    ర్పణ సేయఁ బడెరా ఘన కృపశాంతులు గొనెను నెమ్మదిరా మనసు
    మార్పడి మోక్ష మహిమ గన్గొనెరా
    ||మా యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------