2264) భూదిగంత నివాసులారా నేడే రక్షణ పొందండి

** TELUGU LYRICS **

    భూదిగంత నివాసులారా - నేడే రక్షణ పొందండి (2)
    ఇదియే సమయము - యుగ సమాప్తి కాలము (2)
    నేడే యేసుని చేరుడి - హల్లెలూయ గానము చేయుడి(2)

1.  చీకటిలో ఉన్నవారికి - వెలుగును చూపించును
    చెరలోనున్న వారికి - విడుదల దయచేయును (2)
    మూగవారికి - మాటలు దయచేయును- 
    గ్రుడ్డివారు - చూపు పొందుదురు
    తన నామమున - రక్షణ దయచేయును (2) 
    ||ఇదియే||

2.  లోబడనొల్లని వారలకు - దినమెల్ల చేతులు చాచును
    తనను వెదకని వారికి - ఉచితముగా దొరుకును (2)
    మన పాపములు - తలకు మించినవై యున్నవి-
    మన దోషములు - ఆకాశమంత ఎత్తుగా నున్నవి
    మన కొరకు సిలువలో - మరణించి లేచెను (2) 
    ||ఇదియే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------