1101) తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామము

** TELUGU LYRICS **    

    తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె
    యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని
    మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ 
    ||దెల్లవారిన వేళ||

1.  నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్
    భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు
    మోడ్చి మ్రొక్కుచును
    ||దెల్లవారిన వేళ||

2.  భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ
    బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ
    డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్
    ||దెల్లవారిన వేళ||

3.  దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్
    దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు
    శుభమడుగుకొనుచున్
    ||దెల్లవారిన వేళ||

4.  పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత
    నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ
    దొలఁగించు మని వేఁడుకొనుచున్
    ||దెల్లవారిన వేళ||

** ENGLISH LYRICS **

Thellavarina Vela Deli Vondhi Mana Kreesthu Divya Naamamu Paadere
Yo Priyulaara Divasa Rakshana Vedare Thalli Rommuna Daachu Pilla Reethini
Manala Challadhanamuga Raathi Rella Gaachina Vibhuni
||Thellavarina Vela||

1. Nidrapoyina Vela Nikhilaapadhula Paapi Nishalanni Gadupu Vibhunin
Bhadhramuga Vinathinchi Bhayabhakthitho Manamu Mudhrithaakshula Gelu
Modchi Mrokkuchunu
||Thellavarina Vela||

2. Bhanudayam Bayye Padhmamulu Vikasille Gaanamulu Jese Pakshul
Maanasaabjamu Lalara Manamu Kalvari Mettapai Nekku Ninudhanedi
Prabhu Joochi Vedkan
||Thellavarina Vela||

3. Dittamuga Maanasendhriya Kaaya Shodhanalu Pattukoni Undu Dhinamun
Dhattamuga Mana Naalgu Thatla Yesuni Karuna Chuttukoni Rakshinchu
Shubhamadugukonuchun
||Thellavarina Vela||

4. Paapa Bhaaramu Manamu Prabhuni Pai Nidi Guruni Paadhamulu Chentha
Noragi Kaapu Kartha Vishaala Karamu Maatuna Daagi Aapadhala
Dholaginchu Mani Vedukonuchun
||Thellavarina Vela||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------