1102) తేజస్సంబంధులారా క్రీస్తుని ధరించుకొనుడి

** TELUGU LYRICS **

    తేజస్సంబంధులారా క్రీస్తుని ధరించుకొనుడి
    విజయులుగా యిలలో ఉజ్జీవము నొందుడి
    అ.ప. ఉజ్జీవము నొందుడి జయ ధ్వని చేయుడి
    శుభవార్త చాటుడి స్తొత్రార్పణనర్పించుడి (2)

1.  నలిగిన నిన్ను లేవనెత్తున్
    నీటి యూటగ చేయున్
    భావి తరాలకు నాందిగా చేయున్
    లెమ్ము తేజరిల్లుము (2)
    శోధనలో పడకుండునట్లు (2)
    ప్రభునకు సర్వ౦ అర్పించుము

2.  భారము మోసెడి తన ప్రియసుతులకు
    యేసుడు నెమ్మది నిచ్చున్
    కన్నీరు కారే నీ కన్నులను
    ప్రేమతో తుడిచి హత్తుకొనున్ (2)
    స్థిరపరచి హెచ్చించును (2)
    హొసన్ననుచూ పాడుడి

3.  ఏ ఘడియైన వరుడు శ్రీయేసు
    మేఘారూఢుడై రానుండె
    ఆకాశమందాయనను సంధింప
    యేసుతో నేగ ఆయత్తమా? (2)
    జీవకీరీటము పొందెదము (2)
    క్రీస్తుని పోలి యుందుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------