541) ఓ అబ్రాహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా

** TELUGU LYRICS **

    ఓ అబ్రాహాం ఇస్సాకు - ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు (2)

1.  ఏలోయి అదోనియా - త్రియేక దేవా
    ప్రభుడవు - సృష్టి - కర్తవు నీవు (2)
    ఎల్లరి అద్భుత - రక్షకుడవు (2)


2.  యెహోవాదేవా - ప్రభువుల ప్రభువా
    దర్శనమిచ్చు - దేవుడవు
    ఉన్నవాడవు - నిత్యుడవు

3.  ఎల్ షద్దాయి - ప్రభువా - సర్వశక్తిమంతుడా
    సంపూర్ణ తృప్తినిచ్చు - ప్రభువు నీవే
    సమృద్ధిని రక్షణను - యిచ్చు వాడవు

4.  యెహోవా యీరే - చూచుకొనువాడవు
    యెహోవా రోపె - స్వస్థ పరచువాడవు
    యెహోవా నిస్సీ - విజయమిచ్చువాడవు

5.  యెహోవా కాదేషు - శుద్ధి చేయువాడవు
    యెహోవా షాలేము - శాంతి కర్తవు
    యెహోవా సిద్కెను - మా నీతియు నీవే

6.  యెహోవా రోహి - లోక సంరక్షకుడా
    గొర్రెల నెన్నటికి - నెడబాయవు
    వాటిని విడువక - నడి పెదవు

7.  యెహోవా షమ్మా - ఇచ్చటున్న వాడవు
    జీవింతువు ప్రభు - యుగ యుగముల్
    సదా మమ్ము నీతోనే – నుంచెదవు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------