540) ఓఓహో క్రైస్తవుడా ఓహోహో విశ్వాసి

** TELUGU LYRICS **    

    ఓఓహో క్రైస్తవుడా ఓహోహో విశ్వాసి
    నిరాశ మాటలు పలుకొద్దురా నిరీక్షణతో కొనసాగరా
    దేవుని వాగ్దనం నమ్ముమురా
    జీవపు మాటలు పలుకుమురా

1.  నిరాశలో ఉన్న అబ్రాముకు
    నక్షత్రములు చూపెను దేవుడు (2)
    నిరాశను పారద్రోలెనురా నిరీక్షణతో కొనసాగెరా
    వాగ్దానములను నమ్మెనురా
    వాగ్దాన పుత్రుని పొందెనురా (2)

2.  నిరాశలో ఉన్న పేతురు
    తన దోనె యేసుకు ఇచ్చెను (2)
    ఆయన మాటలు నమ్మెనురా
    చేపలతో తనదోనెనిండెనురా
    యేసయ్యను వెంబడించెనురా
    మనుష్యుల జాలరి ఆయెనురా (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------