739) క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివరించెద

** TELUGU LYRICS **  

    క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివరించెద వినరే ప్రియులార వాస్తవముగ
    మరణించి బ్రతికెనని వసుధలోఁ బ్రకటింపరె యూరూరఁ 
    ||క్రీస్తు||

1.  మరియ మగ్దలేనెకుఁ బ్రథమంబున మన గురువర్యుం డగపడియెఁ
    తరుణీమణులకు రెండవ మాఱొక దర్శనము దయతో నిడియెఁ 
    ||క్రీస్తు||

2.  సీమో నను పేతురును గూడ ద ర్శించె నతఁడు మూఁడవ మాఱు
    ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకుఁ బ్రియ మొనరించె మఱొక తీఱు 
    ||క్రీస్తు||

3.  తోమాలేని తరుణమునఁ బదుగురి తో వచించె గృహమునఁ జేరి
    తోమాకు కనపడి యతని సంశయముఁ దొలఁగించెను బ్రభుఁ డొకసారి
    ||క్రీస్తు||

4.  సందరంపు దరి నేడుగురికి మ త్స్యంబులు వింతగ సమకూర్చె
    సందర్శించియు యాకోబునకును సంతోషము నెంతయుఁ గూర్చెఁ 
    ||క్రీస్తు||

5.  ప్రభుఁ డొక మాఱే నూరుగురిఁ దాఁ బ్రత్యక్షుం డయ్యెను పేర్మి నషయ
    మొసంగి యపొస్తలులకుఁ క్రీ స్తారోహణుఁ డయ్యెను గూర్మిఁ 
    ||క్రీస్తు||

6.  హత్యఁ జేయు నేగెడు తార్సీయున కగపడి రక్షించెను సుమ్ము
    మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో దృశ్యుం డగు నిది సత్యమ్ము 
    ||క్రీస్తు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------