738) క్రీస్తు ప్రభుకే సకల మహిమ

** TELUGU LYRICS **

    క్రీస్తు ప్రభుకే సకల మహిమ - 
    శాశ్వతంబైనది తన రాజ్యం

1.  మర్మంబిదియే - కనుమా ప్రియుడా - 
    ఉర్విని మానవ - సాయము లేక
    పర్వతంబు నుండి - మల్చబడె నొకరాయి

2.  మేలిమి వెండి - రాజ్యాలను - 
    యిత్తడి యినుప - రాజ్యాదులను
    ఈ రాయియే నలుగ - గొట్టును చెత్తవలెనే

3.  ప్రియుడా వింతై - న యీ రాయి - 
    పెరిగి భులో - కమంతాయె
    ప్రభు క్రీస్తుని వింత - సార్వత్రిక సంఘమిదే

4.  ఆ రాజ్యమును - చూచు భాగ్యం - 
    ఆ రాజ్యములో - చేరెడి భాగ్యం
    అనుభవింపనగును - పరిశుద్ధ ప్రజలకే

5.  ఈ సుహృదయ - శుద్ధి నీకు - 
    క్రీస్తు ప్రభువే - కలుగ చేయున్
    యేసాటియులేని - ఈ శుద్ధి నొందుము

6.  మనకిచ్చిన ఆ - హ్వానంబునకు - 
    తన రాజ్యని - త్యమహిమలకు
    తగినయట్టి రీతిన్ - నడుచుకోవలె ప్రియుడా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments