299) ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే

** TELUGU LYRICS **

    ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే
    యేసు రక్తంబున శుద్ధియగువారు కొందరే

1.  ఎల్లరు యీ లోక సౌఖ్యమును పొందజూతురు
    కొందరే శ్రమలయందు పాలుగోరెడి వారు

2.  సైతానుతో పోరాడి జయము నొంద గోరిన
    సంయుక్తుండవు కావలెను ప్రభు యేసునితో

3.  పాడుచేసితివి దుష్టత్వంబులో నీ జీవితము
    నేడైన నీ పాపములనుండి విడుదలొందవా

4.  యేసు సేవకై నీ జీవితము నర్పించుము
    యేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------