** TELUGU LYRICS **
ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు నెయ్యముతో
తన శిష్యవితతికి నయముమీర జెప్పినట్లు
తన శిష్యవితతికి నయముమీర జెప్పినట్లు
||ఇయ్యుడి||
1. మొదట పరముని నంతునియ్యరే సదమల హృదయంబుతోడ సదయు
డగు మన పరమతండ్రి ముదమతోడ నంతయు నిచ్చున్
డగు మన పరమతండ్రి ముదమతోడ నంతయు నిచ్చున్
||ఇయ్యుడి||
2. శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా జెప్పె భక్తితోడ ప్రభుని సేవకు
శక్తికొలది నియవలెను
2. శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా జెప్పె భక్తితోడ ప్రభుని సేవకు
శక్తికొలది నియవలెను
||ఇయ్యుడి||
3. కొంచెముగ విత్తెడివారు కొంచెము సమకూర్చెదరు హెచ్చువిత్తెడి
వారికిలను హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్
3. కొంచెముగ విత్తెడివారు కొంచెము సమకూర్చెదరు హెచ్చువిత్తెడి
వారికిలను హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్
||ఇయ్యుడి||
4. సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ వింతగా
దీవెనలతోడ అంతయు దయచేసి బ్రోచున్
4. సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ వింతగా
దీవెనలతోడ అంతయు దయచేసి బ్రోచున్
||ఇయ్యుడి||
5. యేసు కృపను ఎరిగిమనుడి యేసు మార్గమునందు నడువుడి దాసుడై
ధనమంత విడిచె నీచులకొరకిలను మున్నె
5. యేసు కృపను ఎరిగిమనుడి యేసు మార్గమునందు నడువుడి దాసుడై
ధనమంత విడిచె నీచులకొరకిలను మున్నె
||ఇయ్యుడి||
6. పరమనిధులను నింపుకొనుడి పరమ దేవుని ప్రేమను గనుడి పరమ
నిధులలో చిమ్మెటుండదు దొంగలసలే లేరుసుమండి
6. పరమనిధులను నింపుకొనుడి పరమ దేవుని ప్రేమను గనుడి పరమ
నిధులలో చిమ్మెటుండదు దొంగలసలే లేరుసుమండి
||ఇయ్యుడి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------