** TELUGU LYRICS **
ఐదు గాయము లొందినావా నాకొర! కైదు గాయము లొంది నావా
ఐదు గాయముల నా యాత్మఁ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె
నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే
ఐదు గాయముల నా యాత్మఁ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె
నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే
||ఐదు||
1. గార మైన నీ శ రీర రక్త మిలను ధారయై కారినదా నా నేరమా
యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా
యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా
||ఐదు||
2. అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై రాలెనే యీ
చంద మూహింప నా డెందమ్ము భీతిచేఁ గొందలమై తూలెనే
2. అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై రాలెనే యీ
చంద మూహింప నా డెందమ్ము భీతిచేఁ గొందలమై తూలెనే
||ఐదు||
3. ఎల్ల పాపము మోయు అల్ల దేవుని గొఱ్ఱె పిల్లవు నీవేగదా నా
వల్లనా నీ కింత యల్లాట పుట్టెనే చెల్ల తాళునె నా యెద
3. ఎల్ల పాపము మోయు అల్ల దేవుని గొఱ్ఱె పిల్లవు నీవేగదా నా
వల్లనా నీ కింత యల్లాట పుట్టెనే చెల్ల తాళునె నా యెద
||ఐదు||
4. భంగమౌనట్టి దు ష్పాపులఁ గావ నీ ప్రాణ మర్పించితివా యీ
సంగతిఁ జూడ నీ సాహస మింక నే భంగి నీ జగతి మరవ
4. భంగమౌనట్టి దు ష్పాపులఁ గావ నీ ప్రాణ మర్పించితివా యీ
సంగతిఁ జూడ నీ సాహస మింక నే భంగి నీ జగతి మరవ
||ఐదు||
5. ఆయాసమైన నీ యాపదలెల్ల నే నాలోచింపఁగ నాత్మలో నెడ
బాయక తద్దివ్య పాదసరోజముల్ భాసిల్లు నా యాత్మలో
5. ఆయాసమైన నీ యాపదలెల్ల నే నాలోచింపఁగ నాత్మలో నెడ
బాయక తద్దివ్య పాదసరోజముల్ భాసిల్లు నా యాత్మలో
||ఐదు||
6. తల్లికైన మరి తండ్రి కైన నన్న దమ్ముల కైన లేదే కన్న పిల్లలకైన
నీ ప్రేమఁ పోల్చుద మన్నఁ బృథివిలోఁ గానరాదే
6. తల్లికైన మరి తండ్రి కైన నన్న దమ్ముల కైన లేదే కన్న పిల్లలకైన
నీ ప్రేమఁ పోల్చుద మన్నఁ బృథివిలోఁ గానరాదే
||ఐదు||
7. ఈ ప్రీతి నీ యోర్మి నీ మహాత్మ్యం బిల నెవ్వ రూహింతు రొగి నో
హో ప్రభువా తద్ద యోత్కట గాంభీర్య మూహింప నీకే తగు
7. ఈ ప్రీతి నీ యోర్మి నీ మహాత్మ్యం బిల నెవ్వ రూహింతు రొగి నో
హో ప్రభువా తద్ద యోత్కట గాంభీర్య మూహింప నీకే తగు
||ఐదు||
** ENGLISH LYRICS **
Aidu Gaayamu Londhinaavaa Naakora! Kaidu Gaayamu Londhi Naavaa
Aidu Gaayamula Naa Yaathma Thalampa Naa Kaaraata Mecchinadhe Nee Maidheenge
Naavanti Marthyula Paaljesi Marana Mondhithivi Gadhe
||Aidu||
1. Gaara Maina Nee Sha Reera Raktha Milanu Dhaarai Kaarinadhaa Naa Naeramaa
Yayyadhi Bhaaramai Nee Paini Ghoramai Yoriginadhaa
||Aidu||
2. Andhamau Nee Thanuvu Kandhi Raktha Sveda Bindhuvulai Raalene Yee
Chandha Moohimpa Naa Dhendhammu Bheethiche Gondhalamai Thoolene
||Aidu||
3. Ella Paapamu Moyu Alla Dhevuni Gorre Pillavu Neevegadhaa Naa
Vallanaa Nee Kintha Yallaata Putthene Chella Thaalune Naa Yedha
||Aidu||
4. Bhangamaunatti Dhu Shpaapula Gaava Nee Praana Marpinchithivaa Yee
Sangathi Joodda Nee Saahasa Minka Ne Bhangi Nee Jagathi Marava
||Aidu||
5. Aayaasamaina Nee Yaapadhalella Ne Naalochimpaga Naathmalo Neda
Baayaka Thaddhivya Paadhasarojamul Bhaasillu Naa Yaathmalo
||Aidu||
6. Thallikaina Mari Thandri Kaina Nanna Dhammula Kaina Ledhe Kanna Pillalakaina
Nee Prema Polchuadha Manna Pruthivilo Kaanaraadhe
||Aidu||
7. Yee Preethi Nee Yormi Nee Mahaathmyam Bila Nevva Roohinthu Rogi No
Ho Prabhuvaa Thaddha Yothkata Gaambheerya Moohimpa Neeke Thagu
||Aidu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------