518) ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను

    ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
    సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను
    మధుర ప్రేమతో మనసులు కలువ
    హృదయ సీమలే ఒకటిగ నిలువ
    నీ దీవెనలే పంపుమా

1.  ఆనందముతోడ దు:ఖమునే గెల్వ
    చిరునవ్వుతోడ కష్టముల నోర్వ
    సంసార నావను సరిగా నడిపించ
    నీవే సహాయమీయుమా

2.  ప్రార్ధనా జీవితము సమాధనము
    భక్తి విశ్వాసము నీతి న్యాయము
    నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం
    అనుగ్రహించి నడిపించుమా

3.  ఇహలోకభోగముపై మనసుంచక
    పరలోక భాగ్యముపై క్ష్యముంచగ
    నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై
    సాగే కృప దయచేయుమా

No comments:

Post a Comment

Do leave your valuable comments