280) ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో ప్రభువు రానుండెను

** TELUGU LYRICS **

    ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను (2)
    సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా 
(2) మరనాతా... అ
    ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను.. ఊ ఉ ఉ

1.  మహా మహా ఆర్భాటముతో - ప్రధాన దూత శబ్దముతో
    దేవుని బూరతో - ప్రభువు వేగమే దిగి వచ్చును 
(2)
    ప్రభు నందు మృతులు లేతురు - సమాధులు తెరువగా
    విస్వాసులంతా దాల్తురు - మహిమ రూపును వింతగా
    ఎత్తబడును సంఘము - అయ్యో ! విడువబడుట ఘోరము

    సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా 
(2) మరనాతా... అ
    ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

2.  ఏడేండ్లు భువిపై శ్రమ కాలం - ప్రాణాలు జారే భయ కాలం
    బూరలు తెగుళ్ళు - దైవ ఉగ్రతా పాత్రలు 
(2)
    ఆకాశ శక్తుల్ కదులును -గతి తప్పును ప్రకృతి
    కల్లోలమౌను లోకము - రాజ్య మేలును వికృతి
    సంఘమెంతో హాయి రా - మధ్యాకాశాన విందు రా

    సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా 
(2) మరనాతా... అ
    ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

3.  అన్యాయం చేయువాడు చేయునిమ్ము - అపవిత్రుడట్లే యుండనిమ్ము
    పరిశుద్ధుడింకను - పరిశుద్దుని గుండనిమ్ము 
(2)
    ప్రతివాని క్రియల జీతము - ప్రభు తెచ్చును ఒక దినం
    రహస్య క్రియలు అన్నియు - బయల్పడునులే ఆ దినం
    లోక ధనము కూడిరా - నీకుంద పై సంపదా

    సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా 
(2) మరనాతా... అ
    ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

4.  ఒలీవ కొండపై రారాజు - అడుగు పెట్టెడి ఆ రోజు
    కొండయే చీలును - భూగోళమే కంపించును 
(2)
    ప్రతి జనము ప్రభుని చూచును - ప్రతి జాతీయు మ్రొక్కును
    నిజమైన ప్రభువు యేసని - ప్రతి నాలుక ఒప్పును
    ప్రభుని రెండవ రాకడా - సాతానుకు దడ దడ

    సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా 
(2) మరనాతా... అ
    ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

5.  వెయ్యేండ్లు భువి పై ప్రభు యేసు - పాలించును పరిపాలించును
    నీతి సమాధానం - ఆత్మ యందలి ఆనందం 
(2)
    ఈ భూమి దాని కృత్యముల్ - సమస్తము కాలిపోవున్
    మిక్కటమైన వేడితో - పంచభూతముల్ లయమగున్
    కొత్త భూమి ఆకాశం - ఇంక శాశ్వత జీవితం

    సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా 
(2) మరనాతా... అ
    ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను

6.  క్రీస్తేసును విస్వసించువారే -పరిశుద్ధులుగ తీర్చబడ్డవారే
    దేవుని మహిమకు - నిత్య జీవమునకు అర్హులు 
(2)
    జీవం మరణం రెండును - నీ ఎదుటనే యున్నవి
    ప్రభు యేసే జీవామార్గమని - నీకు తెలుపబడి యున్నది
    విశ్వసించు ప్రియుడా - కాదు తక్కెడోపిక్కడా

    సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా 
(2) మరనాతా... అ
    ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను (2)
    సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా 
(2) మరనాతా... అ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------