** TELUGU LYRICS **
ఇదిగో మీ దేవుడని - యూదా పట్టణములకు - ప్రకటించుడి
ప్రభువగు మన యేసు తానే - శక్తి సంపన్నుడై త్వరగా వచ్చును
అను పల్లవి: బలముగా ప్రకటించుడి - భయపడక ప్రకటించుడి (2)
ప్రభువగు మన యేసు తానే - శక్తి సంపన్నుడై త్వరగా వచ్చును
అను పల్లవి: బలముగా ప్రకటించుడి - భయపడక ప్రకటించుడి (2)
1. ప్రేమగా మాట్లాడుడి - యెరూషలేముతో
నా జనులను - ఓదార్చుడి
ఆమె దోషరుణము తీర్చబడెనని
రెండింతలు ప్రతిఫలము పొందెనని
నా జనులను - ఓదార్చుడి
ఆమె దోషరుణము తీర్చబడెనని
రెండింతలు ప్రతిఫలము పొందెనని
2. సర్వ శరీరులు - గడ్డివంటివారే
అడవి పువ్వు వంటిదే వారి అందము
గడ్డియెండి దాని పువ్వు వాడిపోవును
మన దేవుని వాక్యము - నిత్యము నిలుచునని
అడవి పువ్వు వంటిదే వారి అందము
గడ్డియెండి దాని పువ్వు వాడిపోవును
మన దేవుని వాక్యము - నిత్యము నిలుచునని
3. మన దేవుని మార్గమును సిద్ధపరచుడి
సరాళము చేయుడి రాజమార్గము
మన యేసు మహిమతో బయలుపడును
సర్వ శరీరులు దాని చూచెదరు
సరాళము చేయుడి రాజమార్గము
మన యేసు మహిమతో బయలుపడును
సర్వ శరీరులు దాని చూచెదరు
4. శ్రమననుభవించుడి - మంచి సైనికులై
చిక్కుకొనకుడి - జీవన వ్యాపారములలో
నియమ ప్రకారము - పోరాడుడి
కిరీటము పొంది - యేలుటకై
చిక్కుకొనకుడి - జీవన వ్యాపారములలో
నియమ ప్రకారము - పోరాడుడి
కిరీటము పొంది - యేలుటకై
5. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును
తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో
ప్రీతికరమైన సేవ - చేయుదము
దేవునికే మహిమ - యుగ యుగములకు
తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో
ప్రీతికరమైన సేవ - చేయుదము
దేవునికే మహిమ - యుగ యుగములకు
6. సువార్తను ప్రకటించు ఓ సీయోను
ఉన్నత పర్వతమును ఎక్కుము
సువార్తను ప్రకటించు యెరూషలేమా
నీ యుద్ధకాలము సమాప్తమాయెను
ఉన్నత పర్వతమును ఎక్కుము
సువార్తను ప్రకటించు యెరూషలేమా
నీ యుద్ధకాలము సమాప్తమాయెను
7. ఉపదేశించుము సరిగా సత్యవాక్యము
యోగ్యునిగా సిగ్గుపడని పనివానిగా
బహుమానముతో వచ్చును యజమానుడు
అవిధేయత చూపకు దర్శనమునకు
యోగ్యునిగా సిగ్గుపడని పనివానిగా
బహుమానముతో వచ్చును యజమానుడు
అవిధేయత చూపకు దర్శనమునకు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------