278) ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను

** TELUGU LYRICS **

    ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను
    ఎవని క్రియల ఫలితము - వానికియ్య వచ్చుచున్నాను

1.  మేఘారూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నాను
    ప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి

2.  నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమును
    అపహరింప కుండునట్లు - జాగ్రత్తగా చూచుకో

3.  యేసు ప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడు
    క్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు

4.  వేవేగరా మా ప్రభు యేసు - వేచియున్నాను నీ కొరకే
    నీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------