** TELUGU LYRICS **
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను
అను పల్లవి: ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా
అను పల్లవి: ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా
1. అడవిలో త్రోవనుజేసి - ఎడారిలో నదులను నేను
ఎల్లప్పుడు సమృద్ధిగా - ప్రవహింప జేసెదను
2. నాదు ప్రజలు త్రాగుటకు - నేనరణ్యములో నదులు
సమృద్ధిగా పారునట్లు - సృష్టించెదను నేను
3. అరణ్యములో జంతువులు - క్రూరపక్షులు సర్పములు
ఘనపరచును స్తుతియించును - దీని నాలోచించుడి
4. నూతన సృష్టిగ నినుజేసి - నీ శాంతిని నదివలెజేసి
ననుజూచి మహిమపరచి - స్తుతిబాడ జేసెదను
5. నేనే దేవుడనని దెలసి - నా కార్యములను నెరవేర్చి
ముందున్న వాటికన్న - ఘనకార్యములను జేతున్
6. మరుగైన మన్నానిచ్చి - మరితెల్లని రాతినిచ్చి
చెక్కెదనా రాతిమీద - నొక క్రొత్త నామమును
7. పరలోక భాగ్యంబులు - నరలోకములో మనకొసగెన్
కరుణాసంపన్నుడగు - మన ప్రభువునకు హల్లెలూయ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------