1157) దినములు జరుగుచుండగా సంవత్సరాలు దొర్లుచుండగా

** TELUGU LYRICS **

దినములు జరుగుచుండగా
సంవత్సరాలు దొర్లుచుండగా
నీ కృపను మా యెడల విస్తరింపజేసి
నీ చేతి నీడలో నడిపించితివి
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు మార్గము చూపించెను
నీ చిత్తములో నడిపించెను
ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు
నన్ను చుట్టుముట్టి ఆవరించగా
నీ అదృశ్య హస్తమే నా తోడుగ ఉండి
అద్భుతములు ఎన్నో చేసెను
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు నిరీక్షణ కలిగించెను
ఆధరణ కరువై అలసిన సమయములో
నీ కౌగిలిలో హత్తుకున్నావు
ఆధరణ కర్తవై నా దరికి చేరి
కన్నీరంతా తుడచినావు
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు ఆధరణ కలిగించెను
దీనుల యెడల కృపచూపువాడా
నీ కొరకే కనిపెట్టియుందును
నీ కరుణ హస్తమే నా తోడుగా ఉండి
అన్నిటిలో విజయము నిచ్చును
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు విజయము చేకూర్చెను
దినములు జరుగుచుండగా
సంవత్సరాలు దొర్లుచుండగా
నీ కృపను మా యెడల విస్తరింపజేసి
నీ చేతి నీడలో నడిపించితివి
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు మార్గము చూపించెను
నీ చిత్తములో నడిపించెను
నాకు నెమ్మది కలిగించెను
నాకు నిరీక్షణ కలిగించెను
నాకు ఆధరణ కలిగించెను
నాకు విజయము చేకూర్చెను

** ENGLISH LYRICS **

Dinamulu Jaruguchundaga
Samvatsaraalu Dorluchundaga
Nee Krupanu Maa Yedala Vistharimpajesi
Nee Chethi Needalo Nadipinchithivi

Chorus:
Anudhinam Nee Vaathsalyame
Prathidhinam Nee Vaagdhaaname
Naaku Maargamu Choopinchenu
Nee Chithamulo Nadipinchenu

1. Enno Aapadhalu Apavaadhi Thanthramulu
Nannu Chuttumutti Aavarinchagaa
Nee Adrushya Hasthame Naa Thoduga Undi
Adhbhuthamulu Enno Chesenu
(Chorus)
Naaku Nireekshana Kaliginchenu

2. AadharaNa Karuvai Alasina Samayamulo
Nee Kougililo Hathukunnaavu
Aadharana Karthavai Naa Dhariki Cheri
Kanneerantha Thudachinaavu
(Chorus)
Naaku Aadharana Kaliginchenu

3. Deenula Yedala Krupachoopuvaadaa
Nee Korake Kanipettiyundunu
Nee Karuna Hasthame Naa Thodugaa Undi
Annitilo Vijayamu Nichunu
(Chorus)
Naaku Vijayamu Chekoorchenu

Ending:
Naaku Nemmadhi Kaliginchenu
Naaku Nireekshana Kaliginchenu
Naaku Aadharana Kaliginchenu
Naaku Vijayamu Chekoorchenu

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------