** TELUGU LYRICS **
దిగులు పడకు సేవకా - దిగులు పడకుమయా
నమ్మదగిన దేవుడు - నిన్ను పిలిచె గదా
కష్టాలు తీర్చి - కన్నీటిని తుడిచి - ఆదరించునుగా
నీతోనే నడచి - నీలోనే నిలచి - నిన్ను నడుపునుగా
ఓ సేవకా భయపడకిక - జయము నీదె గదా
||దిగులు||
అగ్నివంటి శోధనలకు - భయపడకుమయా
అగ్నిలోను క్రీస్తు అండ - తోడుండగా
అగ్నిగుండమే - నిన్ను హెచ్చించి -ఘనపరచునుగా
షద్రకు మేషకబెద్నెగోలను - మరచిపోకుమా
ఓ సేవకా భయపడకికా - అగ్ని మేలెగదా
||దిగులు||
ఏమి తిందునో ఎక్కడ ఉందునో - చింతించకుమా
నీకున్న అవసరతలు - తండ్రికి తెలియునుగా
ఆకాశము నుండి - మన్నాను పంపి - పోషించె గదా
ఐదు రొట్టెలు - రెండు చేపలు - సంగతి మరువకుమా
ఓ సేవకా భయపడకిక - గంపలు మిగిలెగదా
||దిగులు||
నీవు కలిగిన దర్శనమును విడిచిపెట్టకుమా
లోకాశలకు ధన సంపదకు - లొంగిపోకుమా
స్త్రీ వ్యామోహం - ఈ లోక స్నేహం - నీకు తగదు గదా
ఆత్మల రక్షణ - సంఘ పోషణ - నీపై నుండె గదా
ఓ సేవకా వెనుదిరుగక - ముందుకు సాగుమయా
||దిగులు||
** ENGLISH LYRICS **
Digulu Padaku Sevakaa - Digulu Padakumayaa
Nammadagina Devudu - Ninnu Piliche Gadaa
Kashtaalu Theerchi - Kanneetini Thudichi - Aadhaarinchunugaa
Neethone Nadachi - Neelone Nilachi - Ninnu Nadupunugaa
O Sevakaa Bhayapadakika - Jayamu Needhe Gadaa
||Digulu||
1. Agnivanti Shodhanalaku - Bhayapadakumayaa
Agnilonu Kreestu Anda - Thodundagaa
Agnigundame - Ninnu Hechchinchi - Ghanaparachunugaa
Shadraku Meshaka Abednegolanu - Marachipokumaa
O Sevakaa Bhayapadakikaa - Agni Melegadaa
||Digulu||
2. Emi Thinduno Ekkada Unduno - Chinthinchakumaa
Neekunna Avasarathalu - Thandriki Teliyunugaa
Aakaashamu Nundi - Mannaannu Pampi - Poshinche Gadaa
Aidu Rottelu - Rendu Chepalu - Sangathi Maruvakumaa
O Sevakaa Bhayapadakika - Gampalu Migilegadaa
||Digulu||
3. Neevu Kaligina Darshanamunu Vidichipettakumaa
Lokaashalaku Dhana Sampadhaku - Longipokumaa
Stree Vyaamoham - Ee Loka Sneham - Neeku Thagadhu Gadaa
Aathmala Rakshana - Sangha Poshana - Neepai Nunde Gadaa
O Sevakaa Venudhirugaka - Mundhuku Saagumayaa
||Digulu||
---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)
---------------------------------------------------------------------------------------