1165) దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా

** TELUGU LYRICS **

    దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా దీవించుమీ గృహము
    దేవపుత్రుల మంచి స్థావరంబుగ వెలసి సత్యకాంతుల బరుప 
    ||దీవించు||

1.  నీవే యీ గృహమునకు నిత్యతలపతివంచు నేవేళ నీ మనసు నెరిగి
    జీవింపగ
    ||దీవించు||

2.  సంభాషణలవేళ సన్నిహితుడా నీకు సంబరంబును గూర్చు సద్వా
    క్కులను బలుక
    ||దీవించు||

3.  భోజన సమయమున భూరి ప్రేమతో నిన్ను పూజ్యుండౌ యతిధిగ
    పూజసల్పుచు బిలువ
    ||దీవించు||

4.  ఇరుగుపొరుగులనెల్ల పరవారివలెగాక పరమాత్మనీసుతుల వలె జూచి
    ప్రేమింప
    ||దీవించు||

5.  అనుదిన ప్రార్థన లందు శ్రద్దాభక్తు లను జూపి క్రైస్తవ యనుభవంబుల
    నొంద
    ||దీవించు||

6.  క్రైస్తవగృహ విధులే గృహమున నెరవేర విస్తారమగు కృపను వీర
    లందరి కొసగి
    ||దీవించు||

7.  ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఈ యూర వీరు నీకింపగు
    సాక్ష్యము నియ్య
    ||దీవించు||

** ENGLISH LYRICS **

Deevinchu Deva Nee Biddalanu Deevinchu Deva Deevinchumi Gruhamu
Devaputhrula Manchi Sthaavarambuga Velasi Sathyakaanthula Barupa
||Deevinchu||

1. Neeve Yee Gruhamunaku Nithyathalapathivanchu Nevela Nee Manasu Nerigi Jeevimpaga
||Deevinchu||

2. Sambhashanalavela Sannihithudaa Neeku Sambharambunu Goorchu Sadwaakkulanu Baluka
||Deevinchu||

3. Bhojana Samayamuna Bhoori Prematho Ninnu Poojyundau Yathidhiga Poojasalpuchu Biluva
||Deevinchu||

4. Iruguporugulanella Paravaarivale Gaaka Paramaathmaneersuthula Vale Juchi Premimpa
||Deevinchu||

5. Anudina Praarthana Landhu Shraddhaabhakthulanu Jupi Kraisthava Yanubhavambula Nondha
||Deevinchu||

6. Kraisthavagruha Vidhule Gruhamuna Neruvera Visthaaramagu Krupanu Veeralandari Kosagi
||Deevinchu||

7. Aayuraarogyambu Laathmaishvaryamulichchi Ee Yoora Veeru Neekimpagu Saakshyamu Niyya
||Deevinchu||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post