** TELUGU LYRICS **
నీ ప్రేమతో నన్ను ఆదరించితివి - నీ కృపతో నన్ను బలపరచితివి
నీ ప్రణాళికలో పుటము వేసితివే - నీ రూపములో నన్ను నిర్మించితివే
వందనం వందనం యేసయ్య నీకే వందనం
నీ ప్రణాళికలో పుటము వేసితివే - నీ రూపములో నన్ను నిర్మించితివే
వందనం వందనం యేసయ్య నీకే వందనం
1. దీనస్థితిలో బాధలో నేనుండగా నాకు ఆదరణకర్తవై
సంరక్షణ లేని స్థితిలో నేను ఉండగా కాపాడిన తండ్రి వైతివి
ఒంటరిన ననుకున్న సమయంలో నా స్నేహితుడవైతివే
కన్నీళ్ళతో నేను కృంగిన వేళలో - కన్నతల్లివి నీవైతివి
2. పరుగెత్తగా నేను మరణము వెదకి - వెన్నంటే రక్షించితివే
ఏ ధరి లేని నా జీవ నావకు మార్గము నీవైతే
నడిపించెదను నేను నిన్నని నా చేయి పట్టుకొంటివే
నను కరుణించి ప్రేమించి దీవించి - నీ కృపలో నడిపించితివే
3. బంధుమిత్రులే నన్ను తృణీకరించగా ఆశ్రయపురమైతివే
రక్తసంబంధువులే నన్ను వెలివేయగా ఓదార్చి దేవుడవైతే
పిలిచితివే నన్ను యేసయ్య నీ ఉన్నతమైన సేవకై
ప్రకటించెదను యేసయ్య నీ సాక్షినై - నా ఊపిరి ఉన్నంతవరకు
** ENGLISH LYRICS **
Nee Prematho Nannu Aadharinchithivi - Nee Kruputho Nannu Balaparachithivi
Nee Pranaalikalo Putamu Veshitive - Nee Roopamulo Nannu Nirminchitive
Vandanam Vandanam Yesayya Neeke Vandanam
1. Deenasthithiyo Baadhaloo Nenundagaa Naaku Aadharanakarthavai
Samrakshana Leni Sthithilo Nenu Undagaa Kaapaadina Thandri Vaithivi
Ontarina Nanukunna Samayamulo Naa Snehithudaavaithive
Kanneerutho Nenu Krungina Velalo - Kannathallivi Neevaithivi
2. Parugethagaa Nenu Maranamu Vedaki - Vennante Rakshinchitive
Ee Dhari Leni Naa Jeeva Naavaku Maargamu Neevaithe
Nadipinchedanu Nenu Ninnani Naa Cheyi Pattukontive
Nanu Karunchi Preminchi Deevinchi - Nee Krupalo Nadipinchitive
3. Bandhumithrule Nన్ను Truneekarinchagaa Aashrayapuramaitheve
Rakthasambandhuvule Nannu Veliveyagaa Oodarchi Devudavaithe
Pilichitive Nannu Yesayya Nee Unnatamaina Sevakai
Prakatinchedanu Yesayya Nee Saakshinai - Naa Oopiri Unnanthavaraku
---------------------------------------------------------------
CREDITS : Vocals : by SP Charan
Music : Symonpeter Chevuri
Lyrics : Rev. Dr. P S George Fernandes
----------------------------------------------------------------