5970) సఖుడా దివ్య సఖుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా

** TELUGU LYRICS **

సఖుడా - దివ్య సఖుడా 
ప్రియుడా - ప్రాణ ప్రియుడా 
నీతో అనుబంధము కాదే ఈ నాటిది 
ఏనాటికీ వీడిపోదు - విభుడా యేసయ్యా 
ఇన్నినాళ్ల తీపి జ్ఞాపిక - పలికే గీతిక

1. మౌనరాగమే మధురగానమై 
మరుపురానిదై - మదిలో నిలిచెగా (2)
ఊహించని శోధనలే - శృతిలయలు నేర్పినాయి 
పలుశ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి 
ఏకాంత వేళలో - ఏ కాంతి లేకున్ననూ 
నా పాదములు జ్ఞారక - కాపాడే యేసయ్యా 
సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను 
నిత్యము నిను కీర్తించెదను 
||సఖుడా||

2. నిండు మనస్సులో - ప్రేమ దీపమై 
మారుమనస్సుకై సత్యమార్గమై (2)
పలికే ప్రేమనీవై - నీవు నాతో నున్నావు 
నా హృదయసీమ నేలే - మహరాజుగా నిలిచావు 
నీవు నా ముందుగా - నడిచే కాపరిగా
నా చేయి వీడకా - నడిపించే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను 
నిత్యము నిను కీర్తించెదను 
||సఖుడా||

3. రమ్యమైనది - భాగ్యమైనది
నిత్యమైనది - సరిపోల్చలేనిది (2)
నీ మహిమ రాజ్యమందు సీయోను శిఖరమందు 
నే పరవశించి పాడే - గొప్ప భాగ్యమిచ్చినావు 
నూతనమైనది- ఎవరూ పాడలేని
శ్రేష్ఠమైన గీతం - నే పాడెద యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను 
||సఖుడా||

** ENGLISH LYRICS **

Sakhudaa - Divya Sakhudaa
Priyudaa - Praana Priyudaa
Neetho Anubandhamu Kaadhe Ee Naathidhi
Enaatikiee Veedipodhu - Vibhudaa Yesayya
Inninaalla Theepee Gnaapika - Palike Geethika

Mounaraagame Madhuragaanamai
Marupuraanidhai - Madhilo Nilichega (2)
Oohinchani Shodhanale - Shruthilayalu Nerpinaayi
Palushramalu Nadipinaayi Nee Prema Shikharaaniki
Ekaantha Velalo - E Kaanthi Lekunnanu
Naa Paadhamulu Gnaaraka - Kaapaade Yesayya
Sadguna Raashivi Neevenani - Sthuthi Mahimalu Chellinchedhanu
Nithyamu Ninu Keerthenchedhanu
||Sakhudaa||

Nindu Manassulo - Prema Deepamai
Maarumanassukai Sathya Maargamai (2)
Palike Premaneevai - Neevu Naatho Nunnaavu
Naa Hrudayaseema Nele - Maharaajuga Nilichaavu
Neevu Naa Mundhugaa - Nadiche Kaaparigaa
Naa Cheyi Veedakaa - Nadipinche Yesayya
Sadguna Raashivi Neevenani - Sthuthi Mahimalu Chellinchedhanu
Nithyamu Ninu Keerthenchedhanu
||Sakhudaa||

Ramyamainadhi - Bhaagyamainadhi
Nithyamainadhi - Saripolchaleniadhi (2)
Nee Mahima Raajyamandhu Seeyonu Shikharamandhu
Ne Paravashinchi Paade - Goppa Bhaagyamicchinaavu
Noothanamainadhi - Evaru Paadaleni
Shresthamaina Geetham - Ne Paadedha Yesayya
Sadguna Raashivi Neevenani - Sthuthi Mahimalu Chellinchedhanu
Nithyamu Ninu Keerthenchedhanu
||Sakhudaa||

-------------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Album: Soundharyapoornudaa (సౌందర్యపూర్ణుడా) Volume - 36
Organization: Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Genre: Christian Worship / Soulful Praise (ఆరాధన గీతం)
Theme: Intimacy with Christ & Eternal Joy (క్రీస్తుతో అనుబంధం - నిత్య సంతోషం)
-------------------------------------------------------------------------------------------------------------------