5972) కరుణ కటాక్షము గల యేసయ్యా నను విస్తరింపజేయు మహనీయ

** TELUGU LYRICS **

కరుణ కటాక్షము గల యేసయ్యా
నను విస్తరింపజేయు మహనీయ (2)
దివ్య సుందరమ - దయకు నిలయమ - దివిలో కాంతితేజమా
పరిమళ నామమ - ప్రేమకు నిలయమ పరిశుద్ధ స్తుతి గానమా

1. ఏమున్నదనీ నాపై లక్ష్యముంచినావు
ఆదరించి ప్రేమించి కటాక్షించినావు (2)
నీ రెక్కల నీడే సురక్షితం - నీ పాద సన్నిధౌ క్షేమము (2)
కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు (2) 
||కరుణ||

2. నేనెంతటి వాడనని ఇంతగ హెచ్చించావు 
ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు (2)
నీ ఇష్టునిగా నివసించెదను - నీ ఉద్దేశము నే మరువను (2)
కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు (2)
||కరుణ||

3. ఏ యోగ్యత లేని నాకు తోడుగ నిలిచావు 
నింద అవమానములో ఘనతనిచ్చినావు (2)
నీ నడిపింపుకు లోబడితిని - నీ స్వాస్థ్యముకై వేచియుంటిని (2)
కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు (2)
||కరుణ||

** ENGLISH LYRICS **

Karuna Katakshamu Gala Yesayya
Nanu Vistharinpajeyu Mahaneeya (2)
Divya Sundharama - Dayaku Nilayama - Divilo Kanthithejama
Parimala Naamama - Premaku Nilayama Parishuddha Sthuthi Gaanama

Emunnadhanee Naapai Lakshyamunchinaavu
Aadharinchi Preminchi Katakshinchinaavu (2)
Nee Rekkala Neede Surakshitham - Nee Paada Sannidhau Kshemamu (2)
Krupa Vembadi Krupanu - Nithyamaina Premanu
Adhikamaina Mahimanu Vistharinpajesaavu (2)
||Karuna||

Nenenthathi Vaadanani Inthaga Hechhinchaavu
Elutaku Ennukoni Abhishhekinchaavu (2)
Nee Ishtuniga Nivashinchedhanu - Nee Uddheshamu Ne Maruvanu (2)
Krupa Vembadi Krupanu - Nithyamaina Premanu
Adhikamaina Mahimanu Vistharinpajesaavu (2)
||Karuna||

E Yogyatha Leni Naaku Thoduga Nilichaavu
Nindha Avamaanamulo Ghanathanicchinaavu (2)
Nee Nadipimpuku Lobadithini - Nee Swasthyamukai Vechiyuntini (2)
Krupa Vembadi Krupanu - Nithyamaina Premanu
Adhikamaina Mahimanu Vistharinpajesaavu (2)
||Karuna||

------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Album : Soundharyapoornudaa (సౌందర్యపూర్ణుడా) Volume - 36
Organization : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Genre : Christian Worship / Praise (ఆరాధన గీతం)
Theme : God's Mercy and Expansion (దేవుని కృప - విస్తరణ)
-----------------------------------------------------------------------------------------------------------