** TELUGU LYRICS **
స్థితులను మార్చే స్తుతులను నేను మరణము వరకర్పించెదను
అపజయమెరుగని జయ జీవితము నిను స్తుతియించి పొందెదను
దేవదూతల దైవారాధన భువియందే అర్పించెదనూ
ఇరువది నలుగురు పెద్దల వలెనే సాగిలపడి పూజించెదనూ
యుగయుగములకు పరిశుద్ధుడవని
ఆరాధించుచు బ్రతికెదనూ
దేవదూతల దైవారాధన భువియందే అర్పించెదనూ
ఇరువది నలుగురు పెద్దల వలెనే సాగిలపడి పూజించెదనూ
యుగయుగములకు పరిశుద్ధుడవని
ఆరాధించుచు బ్రతికెదనూ
ఆరేసి రెక్కలు ఉన్న మహాదూతలన్నియు
పరిశుద్ధుని పరిశుద్ధముగా ఆరాధన చేసిరి
దూతల వలెనూ గొప్ప కంఠస్వరముతో
గాన ప్రతిగానముతో స్తుతి ధూపం వేసెదను
పది మంది కుష్ఠరోగులు స్వస్థతనొందిరి..
యేసుకు ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెల్లించెను
సమరయుని ఆరాధనను కృతజ్ఞత భావముతో
నాలోన కలిగుండి నా జన్మ ధన్యం చేసెదను
ఆకాశ తారను చూస్తు జ్ఞానులువచ్చిరి
శిశువైన యేసుని ఎదుట సాగిలపడిరి
ఎంత ఎదుగుచున్ననూ నీ కాళ్ళ ఎదుట
కలిగి ఉన్నదంతయు ఇచ్చి నీ సేవ చేసెదనూ
** ENGLISH LYRICS **
Sthithulanu Maarche Sthuthulanu Nenu Maranamu Varaku Arpinchedanu
Apajayamerugani Jaya Jeevithamu Ninu Sthuthiyinchi Pondedanu
Devadoothala Daivaaradhana Bhuviyandhe Arpinchedanu
Iruvadi Naluguru Peddala Valene Saagilapadi Poojinchedanu
Yugayugamulaku Parishuddhudavani
Aaraadhinchuchu Brathikedanu
Aaresi Rekkalu Unna Mahaadoothalanniyu
Parishuddhuni Parishuddhamugaa Aaraadhana Chesiri
Doothala Valenu Goppa Kanthaswaramutho
Gaana Prathigaanamutho Sthuthi Dhoopam Vesedanu
Padhi Mandi Kushtharogulu Swasthathanondiri..
Yesuku Okkade Vacchi Kruthajnatha Chellinchenu
Samarayuni Aaraadhananu Kruthajnatha Bhaavamutho
Naalona Kaligundi Naa Janma Dhanyam Chesedanu
Aakaasha Thaaranu Choosthu Gnaanulu Vacchiri
Shishuvaina Yesuni Eduta Saagilapadiri
Entha Eduguchunnanu Nee Kaalla Eduta
Kaligi Unnadanthayu Ichchi Nee Seva Chesedanu
----------------------------------------------------------
CREDITS : Music, Tune : Daniel John
Lyrics, Vocals : Bro. Prakash Garu
----------------------------------------------------------