1060 ) ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ

** TELUGU LYRICS **

ఎందుకయ్యా యేసయ్యా - నాపై ఇంత ప్రేమ (2)
పాపిని నా కొరకు నీకు - ఏల శిలువశ్రమ (2)

శ్రీమంతుడవు - సిరికే రాజువు 
ప్రార్ధించినంతనే - కృపచూపువాడవు 
కడుదీనుడవై మరియ సుతుడవై  (2)
పశులశాలలో - జన్మించినావా
నాకై - ఇంత తగ్గించుకున్నావా  
||ఎందుకయ్యా||

న్యాయము జరిగించు - శాసన కర్తవు 
న్యాయాధిపతిగా రానున్నవాడవు
లోకాధికారుల తీర్పునకు తలవంచి (2)
దొంగలనడుమ మరణించినావా 
నాకై ఇంత తగ్గించుకున్నావా
||ఎందుకయ్యా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------