2615) యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు

** TELUGU LYRICS **

    యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు - నీదు ప్రేమను నేను పొందుచున్నాను
    దిన దినము నాయెడల - నీ కృప విస్తరించు చున్నది (2)
    నీ కృప విస్తరించు చున్నది.

1.  ప్రేమతోనే పిలిచేవారు ఈ ధరణీలో ఎవరు లేరు
    నా చేయిపట్టి నడిపేవారు ఈలోకమందు కానరారే (2)
    అయితే తల్లిగా, తండ్రిగా నీవే వున్నావు
    నీదు ప్రేమతో నా చేయిపట్టి నడుపుచున్నావు (2) 
    ||దినదినము||

2.  నా యోగ క్షేమమడిగేవారు నా మిత్రులలో ఎవరులేరు
    ఆధరణా చూపేవారు అయిన వారుకానరారే -(2)
    అయితే స్నేహమై, బంధమై నీవే వున్నావు
    అన్నివేళలా ఆధరణ చూపుచున్నావు
 (2)
    ||దినదినము||

3.  కష్టాలు తీర్చేవారు ఒక్కరైనా కానరారే
    ఓదార్పునిచ్చేవారు ఎవరు నాకు లేనేలేరే -(2)
    అయితే ప్రియుడవై, ప్రేమికుడవై నీవే వున్నావు
    నిత్యము నీ సన్నిధిలో బలపరుచుచున్నావు
 (2)
    ||దినదినము||

** ENGLISH LYRICS **

Yesu Neevu Nannu Premisthunnavu - Needu Premanu Nenu Ponduchunnanu
Dina Dinamu Nayedala - Nee Krupa Vistharinchoo Chunnadhi (2)
Nee Krupa Vistharinchoo Chunnadhi.

1. Premathone Pilichevaaru Ee Dharaneelo Evaru Leru
Naa Cheyipatti Nadipevaaru Ee Lokamandu Kaana Raare (2)
Ayithe Thalligaa, Thandrigaa Neeve Unnaavu
Needu Prematho Naa Cheyipatti Nadupuchunnaavu (2)
||Dina Dinamu||

2. Naa Yoga Kshemamadigevaaru Naa Mithrulalo Evaruleru
Aadharanaa Choopevaaru Ayina Vaarukaana Raare (2)
Ayithe Snehamai, Bandhamai Neeve Unnaavu
Annivelalaa Aadharana Choopuchunnaavu (2)
||Dina Dinamu||

3. Kashtaalu Teerchevaaru Okkarainaa Kaana Raare
Odharpunichchevaaru Evaru Naaku Lene Lere (2)
Ayithe Priyudavai, Premikudavai Neeve Unnaavu
Nithyamu Nee Sannidhilo Balaparuchuchunnaavu (2)
||Dina Dinamu||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------