2602) యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా

** TELUGU LYRICS **    

    యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా
    మోసములన్నిటి మునగఁద్రోతునని బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా 
    ||యేసు||

1.  రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి
    దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా
    ||యేసు||

2.  హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును
    సదయుఁడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ
    ||యేసు||

3.  కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ
    పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము మాపాలకుఁడవో
    ||యేసు||

4.  మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ మానము మహిమలు
    మనుజుల కియ్యను భానుఁడ రాజుగ బ్రతికిలేచితివి
    ||యేసు||

5.  చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల
    నిడితివి ధరలో నరులకు పరముఁడ నీ దయ మరువశక్యమా
    ||యేసు||

** ENGLISH LYRICS **

Yesu Naayakuda Yella Velalanu Nee Dhaasula Nelumayyaa
Mosamulanniti Munagadhrothunani Baasalu Jesina Prabhudavu Nevega
||Yesu||

1. Reyimbavalu Maa Nyaayamu Cheripedhi Maaya Pishachini Throyumi
Dhooramu Baayaka Bhakthula Cheyi Viduvani Bahu Shreshtuda Nevega
||Yesu||
2. Hrudhayamu Lokamu Madhi Paapamu Mammu Sathathamu Shrama Pettunu
Sadayuda Mammunu Vadhalaka Nithyamu Madhi Thalapulalo Mahimaganeelumi
||Yesu||

3. Kaapaadumi Mammu Maapu Repu Nee Shree Paadhamu Loddhanu Ee
Paapamulunu Elakundaga Nee Praapunabenchumu Maa Paalakudavo
||Yesu||

4. Maa Korakai Nee Menunu Mraanuna Mekulatho Gottaga Maanamu Mahimalu
Manujula Kiyyanu Bhaanuda Raajuga Brathikilechithivi
||Yesu||

5. Cheranu Cheranugaa Mari Pattuka Neevu Paramuna Karigithive Varamula
Nidithivi Dharalo Narulaku Paramuda Nee Dhaya Maruvashakyama
||Yesu||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------