2603) యేసు నావాడని నమ్ముదున్ ఎంతెంతో దివ్య సౌభాగ్యము

** TELUGU LYRICS **

1.  యేసు నావాడని నమ్ముదున్ - ఎంతెంతో దివ్య సౌభాగ్యము
    దాసుడనౌచు పాల్పొందెదన్ నాశంబులేని సౌఖ్యంబును
    పల్లవి: ఇదే నా పాట నా సుకథ యేసుని సదా స్తుతించుట
    ఇదే నా పాట నా సుకథ యేసున్ నిత్యము ధ్యానించుట

2.  సంపూర్ణ భక్తితో నుండెదన్ - పెంపార యేసును ధ్యానించెదన్
    సొంపైన దూతల్ బల్కుచుండన్ - ఇంపైన మాటల్ నే విందున్

3.  నిండైన భక్తితో నెమ్మది నిల్చునదేమి యేసుండగ
    మెండైన దీప్తిన్ బ్రార్థించుచు - దండిగ బ్రేమన్ సుఖింతును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------