** TELUGU LYRICS **
యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు నే నీ సుమార్గముఁ బట్టితి నా
స్వజనము లనాదరంబునఁ త్రోసినను పగజేసిన నా సమస్తము నీవెగా
యిక నే సరకుగొన నేమియున్
||యేసు||
1. ఎన్ని శ్రమలు వచ్చిన లోకపు టాశ లన్ని భిన్నము నొందిన నన్ను
ఖిన్నునిజేయ నేరవు సన్నుతుండును స్వర్గము నన్ని నావైయున్న విగ నిఁక
నన్నుఁ గదుపున దెవ్వరు
||యేసు||
2. ఆపదల్ ననుఁ జుట్టినఁ జేరుదు నే నో పరాత్పర రొమ్మునఁ బ్రావ
కుండవు పతితుఁడై నీ దాపు జేరిన వానికిన్ దాప మాపుచు సంతసంబిడి
ధన్యుఁ జేయుదు వీవెగా
||యేసు||
3. నినుఁ బ్రేమించెడు తండ్రిని నా యాత్మా నిను రక్షించిన క్రీస్తును
గనుమునిన్నుఁ జొ చ్చిన ప్రియాత్మను ఘన త్ర్యేకుని నిత్యమున్ గొనుము
రక్షణ, పాపము చింతను విడిచి యిం కెన్నఁడున్
||యేసు||
4. విశ్వాస కవచంబును మేను నిడి విజ్ఞాపనము చేయుము శాశ్వతంబగు
రాజ్యమునకును సదయుఁడౌ ప్రభువు నడుపు విశ్వసితము లభించునట
నీ విన్నపము స్తుతి యౌనుగా
||యేసు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------