2638) యేసు భక్తవరులతో నివాసముందమ యేసుదాసు

** TELUGU LYRICS **

    యేసు భక్తవరులతో ని వాసముందమ యేసుదాసు లౌదమ 
    ||యేసు||

1.  దోసములను తీగలన్ని కోసివేతమ మిగుల మోసపుచ్చు నాసలెల్ల
    రోసివేతమ యేసుదాసు లౌదమ 
    ||యేసు భక్త||

2.  దోసిలొగ్గి ప్రభునివేడ గాసి పడుదమ వాసిగాను యేసుమీద
    నాసపడుదమ యేసు దాసు లౌదమ
    ||యేసు భక్త||

3.  జారచోర దుష్కృతములు పారవేతమ సత్య సార మెరుగ బరమ
    గురుని జేరు కొందమ యి(క కోరు కొందమ
    ||యేసు భక్త||

4.  ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును యేసు శాపరాసులన్ని తానే యోపి
    మోసెను తండ్రి దాపొసంగును
    ||యేసు భక్త||

5.  శరణుజొ చ్చు నందరకును దురిత మెంచక ఘోర మరణ బాధలెల్ల
    దీర్చి పరమొసంగును స్ధిర వరము లిచ్చును
    ||యేసు భక్త||

6.  లోక భోగముల మదిన్ని రాకరింతమ ప్రభు రాక కెదురు జూడ మన
    మేక మౌదమ ఇపుడె యేక మౌదమ
    ||యేసు భక్త||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------