2725) యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి మన నావంతు

** TELUGU LYRICS **

    యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి మన నావంతు
    సహదాసులతో మహి నొకఁడనని సహాయ మిడుటే నీవంతు 
    ||యెహోవా||

1.  మితిమిఱిన దు రిత సమూహముల క్షత మొనర్ప మన నావంతు
    పతితపావనుని క్షతజనములో నను నుతికి కడుగుటె నీవంతు 
    ||యెహోవా||

2.  ప్రతిదిన బ్రతుకును మతి నుంచుచు నిను స్తుతి యొనర్చుటే నావంతు
    క్షితినేఁబడుదు ర్వెతల నుండ శా శ్వతముఁ బ్రోచుటె నీవంతు 
    ||యెహోవా||

3.  చంచల మతిఁదొల గించుమంచుఁ బ్రా ర్థించుచుండుటే నావంతు
    అంచి తాత్మనిఁకఁ బంచి స్ధిరతను బెంచుచుండుటే నీవంతు 
    ||యెహోవా||

4.  యేసు సిలువలో నే సంధించి గాసి సహించుట నావంతు భాసురమోక్ష
    ని వాసమునకు నను దీసుకపోవుటే నీవంతు 
    ||యెహోవా||

5.  మేటి వార్త నా బోటి జనాళికి ఁ జాటించుటయే నావంతు చాటిన
    దానిని గాటముగ మది నాటించుటయే నీవంతు 
    ||యెహోవా||

6.  అనుదిన మబలుఁడ నని మదినిం గనుఁ గొని బ్రదుకుటయే నా
    వంతు ననుఁ బదాబ్జప జ్జనుఁ జేర్చియు బల మును గృప నిచ్చుటే
    నీవంతు 
    ||యెహోవా||

7.  ముదముతోడ నీ తుదిరాక కొఱకు నెదురు చూచుటే నావంతు
    సదమలాత్మచే హృదయమును సదా పదిలపఱచునటే నీవంతు 
    ||యెహోవా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------