2726) యెహోవాయె మనకందరికి ఎన్నియో మేలుల జేసెన్

** TELUGU LYRICS **

    యెహోవాయె మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్
    తన కృప కనికరముల్ - స్మరియించి స్తుతించెదము

1.  మనమాయన జనము - ఆయన సంతతియు
    సిలువ మరణముద్వారా మనకు - తనదు జీవమునిచ్చె
    ఎంత అద్భుత రక్షకుడు

2.  అడుగువాటికంటె - అధికముగ నిచ్చె
    తన నిబంధనను స్థిరపరచి - తన వాక్కులు నెరవేర్చె
    మాట తప్పనివాడవు

3.  కష్టదుఃఖములందు - పాలివాడాయె
    ప్రేమనుజూపి ప్రభువే మనల - తన రెక్కలపైమోపె
    మనతో నుండును నిరతము

4.  ఎన్నిసార్లు ప్రభుని - దుఃఖపరచితిమి
    అయినను ప్రభువే తన దయజూపి
    మనలన్ క్షమియించెనుగా - ప్రేమగల మా తండ్రివి

5.  నీవే మా దుర్గమును - కేడెము నీవే
    నిన్నుమేము నమ్మియున్నాము - మాకు సర్వము నీవే
    మేము నీదు ప్రజలము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------