2727) యెహోవాయే మనదేవుడు మార్పులేనివాడు

** TELUGU LYRICS **

    యెహోవాయే మనదేవుడు - మార్పులేనివాడు (2)
    నిన్న నేడు నిరంతరము - ఒకే రీతిగా ఉన్నాడు (2)

1.  పాపశాపముల బాప - మానవ రూపి ఆయెను
    అద్భుత ప్రేమ జూపి - మనలను తానె రక్షించెను

2.  తన రెక్కలతో కప్పి - ఆశ్రయమిచ్చును ఆయనె
    స్వరక్త మిచ్చి కొన్న - తన సంఘమును కాయును

3.  క్రుంగిన వేళలందు - అభయమునిచ్చె దేవుడు
    తన హస్తముతో నిలిపి - అంతమువరకు ఆదుకొనున్

4.  శాశ్వత ప్రేమ జూపి - శ్రమలలో విజయ మిచ్చును
    విశ్వమంతయు మారిన - ఎన్నడుమారడు మనయేసు

5.  సంఘముగా చేరి - యెహోవాకే మొర్ర పెట్టెదము
    ఆపత్కాలము నందు - ఉత్తరమిచ్చును ఆయనె

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------