2721) యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు

** TELUGU LYRICS **

    యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు
    మేలుతో నీహృదయమును - తృప్తిపరచుచున్నాడు

1.  దేవా నీదు కృపతో - నన్ను కరుణింపుము
    నీ వాత్సల్యతతో నా - గత పతనంబుల క్షమియించు

2.  ఆకాశమున నుండి కలిగిన - దర్శనమునకు
    నే నవిధేయుడను కాను - నా దేవా జూపుము కృపను

3.  బాధించు శత్రువు నన్ను - బలముగ బాధించినను
    నే ధైర్యము విడువను - నను బలపరచుము నీలోన

4.  ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండెద నిలలో
 
   పావనమగు నీ యాత్మన్ - ప్రాపుగ నొసగుము నీదయతో

5.  ప్రభుయేసు నామమిలలో - ప్రాకటముగ నే బ్రకటింతు
    ప్రత్యక్షముగ నీ శక్తిన్ - ప్రసాదించుము నాకిలలో

6.  నీయందు నేను నిలిచి - నిత్యము నే ఫలియింతున్
    సత్యాత్ముడా నాకిమ్ము - నిత్యముగను నీ జీవం

7.  ఆత్మాగ్ని చేత దేవా - అజ్ఞానుండగు నను నింపు
    నీ జ్ఞానము నాకిమ్ము - సుజ్ఞానుండా హల్లెలూయా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------