2720) యెహోవ యందు భక్తి బహుగ గలిగియుండి మహిమాఢ్యుని

** TELUGU LYRICS **

    యెహోవ యందు భక్తి బహుగ గలిగియుండి మహిమాఢ్యుని
    మార్గంబులయందు గృహముల నడుపు నరులే ధన్యులు

1.  దేవుని యందలి భయము దీనుల దీవించున్ నీవు నీ జేతుల
    కష్టార్జితమును నిత్యము ననుభవంతువు నిజముగ 

2.  ఉల్లమలర భార్య ద్రాక్షా వల్లివలె ఫలించు పిల్లలొలీవ మొక్కల
    చందము పెంపొందుదు రెంతయు సొంపుగను 

3.  దేవుని భక్తియే నీ కిల దీర్ఘాయువు నిచ్చు గావున నీ పిల్లల పిల్లలను
    గాంతువు ప్రభు కృపతోఁ వెలగుదువు 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------