2678) యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతో

** TELUGU LYRICS **

    యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతోఁ
    బ్రోచి నన్ను మనుపు నాతఁడే

1.  పచ్చికగల చోట్ల నను పరుండజేయుచుఁ గడు హెచ్చగు సౌఖ్యములు
    సదా యిచ్చు నాతఁడే

2.  శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు
    విభుఁడు అతఁడే

3.  గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిఁక
    నా తోడు ఆయనే

4.  దుడ్డుకఱ్ఱతో శత్రువులఁ దరుమఁగొట్టుచుఁ దన దొడ్డ దండముతో
    నీతి దారిలో నడుపు

5.  అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతోఁ గడు విందు లొసఁగి
    తృప్తిపరుచు విభుఁడు ఆయనే

6.  ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుఁడు నాకుఁ
    బూయుచుండు సకల వేళలన్

7.  బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా
    క్షేమములు నా వెంటవచ్చును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post