2512) యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకు ఓ మనసా

** TELUGU LYRICS **

యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకు ఓ మనసా
కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా
విడువను మరువను నా యేసు ప్రభువును నేను (2) 
||యావ||

మన కలుషితమైన జీవితములను కడిగిన మాన్యుని 
మరువకుము మరువకుము మరువకుము
శృతిలేని మన జీవితములను శృతిమీటిన 
ప్రభు మరువకుము మరువకుము మరువకుము
సందేహమేల ప్రభు క్రీస్తువాడవుకావా (2)
||యావ||
మితిలేని ప్రభు క్రీస్తుని ప్రేమే ప్రతి ఆత్మను 
వెలిగించెనుగా హల్లెలూయా హల్లెలూయా
పాపికి మోక్ష నివాసమునిడగా సత్య మార్గమున్ 
చూపెనుగా చూపెనుగా చూపెనుగా
కలకాలం ప్రభు ప్రేమలో ఇల సాగిపో మానవుడా (2)
||యావ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------