2511) యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు

** TELUGU LYRICS **

    యాజక ధర్మము నెరిగి - యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు

1.  ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతు
    అతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు

2.  ప్రధాన యాజకుడు మనయేసే - యాజకులము మనమే
    పరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు

3.  నాదాబు యనగా మనసున్నవాడని - అబీహువు నా తండ్రి
    ఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి

4.  అహరోను ధరించిన వస్త్రములేడు - వాని యర్ధమేమి?
    ప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును

5.  పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ - నిలువుటంగీ, పాగ
    మేలిమి బంగరు రేకు, విచిత్ర - మైన చొక్కా ఏడును

6.  ఆయనతోడ వేయి వత్సరములు ఆనందముతో నేలుచు
    యాజకులందరు భాగ్యశాలులై హల్లెలూయ పాడెదరు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------