3006) వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద

** TELUGU LYRICS **

    వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు
    తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో 
    ||వద్దు||

1.  చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు
    మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక
    ||వద్దు||

2.  నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ
    యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో
    ||వద్దు||

3.  ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చనఁ జేసి నను మోసి
    కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిఁక
    ||వద్దు||

4.  బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు
    యేసుండు నీ యండ నుండఁగ నీ గుండె దిగు లేల యిఁక
    ||వద్దు||

5.  పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగఁ జుట్టుకొను
    కష్టముల బిట్టు విడఁగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిఁక
    ||వద్దు||

6.  మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు
    ర్భావముఁ ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిఁక
    ||వద్దు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------