3018) వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును

** TELUGU LYRICS **

    వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును
    విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు

1.  ఇదివరకు మీరెవ్వరైనను - క్రీస్తు పేరట అడుగలేదుగదా
    మదినెంతో నిండు సంతోషముపొంది - అడుగుడి దొరుకు మీకు

2.  తన మహిమ ఐశ్వర్యము చొప్పున - నివ్వ క్రీస్తు యేసు కోరియుండ
    మీ నేత్రములు పరమువైపు త్రిప్పి - అడుగుడి దొరుకు మీకు

3.  దేవుని మందిర నిధిలోనికి - దశమ భాగములెల్ల తెండు
    దీవెనలు క్రుమ్మరించు నిక్కముగ - శోధించుడి దేవుని

4.  ఆయురారోగ్య శక్తిసంపదల్ దేవుని ఉచిత కృపయేగదా
    ఆయనకు అర్పణం నర్పించి - శోధించుడి దేవుని

5.  యెహోవా నాశ్రయించు వారికి - ఎట్టిమేలు కొదువై యుండదు
    యెహోవా ఉత్తముడని నమ్ముడి - రుచించి గుర్తించుడి

6.  దీనుడైన నీవు మొరపెట్టగా - శ్రమలలోనుండి రక్షించెదనిన్ను
    తన నామమందు నమ్మిక యుంచి - రుచించి గుర్తించుడి

7.  పాటించుము దేవుని ఆజ్ఞలన్ నీ క్షేమము గొప్ప నదివలెను
    నేటినుండి సముద్రపుటలలను - పోలి నీ నీతియుండు

** ENGLISH LYRICS **

Vaagdaanamulu Ponduidi Meelo Prathivaadunu
Vishwaasamu Chaethanu Orputhodha Neppudu

1. Idhivaraku Meerevvarainanu - Kreesthu Paerata Adugalaedhugadhaa
Madinentho Nindu Santhoshamupondi - Adugudi Dhoruku Meeku

2. Thana Mahima Aishvaryamu Choppuna - Nivva Kreesthu Yesu Koriyunda
Mee Naethramulu Paramuvaipu Thrippi - Adugudi Dhoruku Meeku

3. Dhaevuni Mandhira Nidhiloniki - Dashama Bhaagamulella Thandu
Dheevenalu Krummarinchu Nikkamuga - Shodhinchudi Dhaevuni

4. Aayuraarogya Shakthisampadal Dhaevuni Uchitha Krupaeyaegadhaa
Aayanaku Arpanam Narpinchi - Shodhinchudi Dhaevuni

5. Yehovaa Naashrayinchu Vaariki - Etti Maelu Koduvaia Yundhadhu
Yehovaa Utthamudani Nammudi - Ruchinchi Gurthinchudi

6. Dheenudaina Neevu Morapettagaa - Shramalalonundi Rakshinchadhaninnu
Thana Naamamandhu Nammika Yunchi - Ruchinchi Gurthinchudi

7. Paatinchumu Dhaevuni Aagnalan Nee Kshaemamu Goppa Nadhivalenu
Naetinundi Samudhrapu Thalanu - Poli Nee Neethiyundu

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------