3393) స్తుతి యాగము నా యేసుకే అర్పించెదను ఎల్లప్పుడు

** TELUGU LYRICS **

    స్తుతి యాగము నా యేసుకే - అర్పించెదను - ఎల్లప్పుడు

1.  నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి - ప్రతి నిముషము నా మార్గములొ
    నన్ను నడిపిన కృపను తలంచి - స్తుతులర్పించెదను - నీకె
    ||స్తుతి||

2.  ఓదార్పు లేనట్టి చీకటి వేళలో - ఆదరణ కర్తవు నాకు నీవు
    మారా అనుభవం మార్చి ఇలలొ - సంతసమిచ్చితివి - నిత్య
    ||స్తుతి||

3.  రక్షక నీవే నా శైలము బలమును - యుద్ధ దినములో నాకేడము
    సాతాను అస్త్రములు ఆర్పివేసి - జయము నొసగితివి - గోప్ప
    ||స్తుతి||

4.  దేవుని సెలవు లేనిది ఏదయు - జరుగదుగా అని గ్రహించితిని
    నా జీవితములో ప్రతి దినమును - మేలుకొరకే గదా కల్గెను
    ||స్తుతి||

5.  ఆర్భటించు సీయోన్ హర్షించు - షాలేమా నీ యేసు నీతోనె యుండెనుగా
    ఆయన మనకు ఆదియు అంతము - పాడెద హల్లెలూయ ఆమేన్
    ||స్తుతి||

** ENGLISH LYRICS **

Sthuthi Yaagamu Naa Yesuke - Arpinchedhanu - Ellappudu

1. Naa Shrama Dhinamuna Naaku Javaabicchi - Prathi Nimushamu Naa Maargamulo
Nannu Nadipina Krupanu Thalanchi - Sthuthularpinchedhanu - Neeke
||Sthuthi||

2. Odhaarpu Lenatti Cheekati Velalo - Aadharana Karthavu Naaku Neevu
Maaraa Anubhavam Maarchi Ilalo - Santhasamicchithivi - Nithya
||Sthuthi||

3. Rakshaka Neeve Naa Shailamu Balamunu - Yuddha Dhinamulo Naakedamu
Saathaanu Asthramulu Arpivesi - Jayamu Nosagithivi - Goppa
||Sthuthi||

4. Devuni Selavu Lenidhi Edhayu - Jarugadhugaa Ani Grahinchithini
Naa Jeevithamulo Prathi Dhinamunu - Melukorake Gadhaa Kalgenu
||Sthuthi||

5. Aarbhatinchu Seeyon Harshinchu - Shaalemaa Nee Yesu Neethone Undhenugaa
Aayana Manaku Aadhiyu Anthamu - Paadedha Hallelooya Amen
||Sthuthi||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------