3128) శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో

** TELUGU LYRICS **

    శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో

1.  సదయుడు ప్రేమించె - శత్రువైన నిన్ను
    దూరస్థుడవైన నీ యెడల - దయచూపించె
    వహించె నీ శాపం భరించె నీ పాపం
    నీ మనస్సు మార్చుకొనిన - సంతసించును ప్రభుయేసు

2.  దొంగవై నీవున్నా - దురితంబులెన్నున్నా
    దోషంబుల క్షమియించు - తన సిలువ రక్తముతో
    తెరచెనుగా నీ కొరకు - పరలోక ద్వారము
    నెమ్మది నిచ్చును నీకు - యేసుని విశ్వసించిన

3.  ఎవరేసు రక్తములో - కడుగబడెదరో
    వారే చేరెదరు - తన సంఘమునందు
    అంగీకరించుము - యేసును నీవు
    కలిగించు నీకు తృప్తిని - నేడే నీ వాయనను వేడు

4.  సిలువపై యేసు - సర్వ మర్పించె
    నీ రక్షణ కొరకు - క్రయము చెల్లించె
    యేసునకు నీవు - ఏమియ్యగలవు?
    తెరువు నీ హృదయ ద్వారమును - నేడే ప్రవేశించును తాను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------