3331) సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్

** TELUGU LYRICS **

    సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు
    భారవాహక మెక్కి బాలస్తోత్రములతో బైలుదేరి వచ్చె 
    ||సీయోను||

1.  హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను
    అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే
    ||సీయోను||

2.  హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపులఁ బ్రోచు
    తాల్మిరక్షకుఁడితఁడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను 
    ||సీయోను||

3.  ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు
    బూర్వపితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపుఁ డితఁడు
    ||సీయోను||

4.  వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా ప్రభుని
    పేరట వచ్చు మెస్సీయ్యదావీదు కొడుకా శ్రీశుభములు 
    ||సీయోను||

** ENGLISH LYRICS **

Seeyonukanya Sambhramapaduchu Veeyumu Kekal Paayaka Nee Raaju
Bhaaravaahaka Mekki Baalasthothramulatho Bailudheri Vacche
||Seeyonukanya||

1. Hebraayilonu Nee Raaju Peru Yoodhularaaju Heebreeya Janulanu
Abraamu Kodukulanu Vibhavadeshamu Jerchu Shubharaaju Yeethandhe
||Seeyonukanya||

2. Helleneelonu Nee Raaju Peru Yoodhularaaje Yellapaapula Brochu
Thaalmirakshakudithadu Challani Prabhuvani Golgotha Mrogenu
||Seeyonukanya||

3. Urvi Romaalo Nee Raaju Peru Yoodhularaaje Sarvaraashtrikulaku
Boorvapitharulathonu Narasimhaasana Micchu Varadeshaadhipudithadu
||Seeyonukanya||

4. Vaasiga Heebree Helleneelo Romaayilonu Hosanna Prabhuni
Perata Vacchu Messeyyadaaveedu Kodukaa Shreeshubhamulu
||Seeyonukanya||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------