3299) సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి

** TELUGU LYRICS **

1.  సిల్వచెంత నేసువా - చేర్చి నన్ను నుంచు
    కల్వరిన్ స్రవించెడు - కాల్వలో నన్ముంచు
    పల్లవి: సిల్వకే సిల్వకే - చెల్లు నా విముక్తి
    చెల్వ మొప్ప నద్దరిన్ - జేర నాకు ముక్తి

2.  కంపితాత్ము నంధునై - కానలేక యుండ
    సొంపుమీరఁ బ్రోచితి - సూర్య తేజస్కుండ

3.  దేవ గొఱ్ఱెపిల్ల - నీ - దీప్తి నాకుఁ జూపు
    నీ వధాప్రభావముల్ - పావనుండ నేర్పు

4.  నే నిరీక్షణంబుతో - నెప్డు వేచి యుందున్
    భూనితాంత వారథిన్ - బూని యీది మన్దున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------