3190) సంతోషింపరె ప్రియులారా యేసుని చెంత

** TELUGU LYRICS **

    సంతోషింపరె ప్రియులారా యేసుని చెంత సంతసింపరె మనసార
    ఎంతో ప్రేమించి య నంతు డొసగెను సుతుని వింతగ బ్రతుకువ సంత
    శోభను దాల్చె అంతరంగములో వసించిన చింత లెల్లను వాడ బారెను
    గంతు లిడుచును నూత్నజీవ ల తాంతములు పూయంగ దొడగెను 
    ||సంతో||

1.  సిలువలో వలరారిన యేసునిప్రేమ ఫలియించె హృది వనమున
    కలుష మెల్లను బాపు కలువరిలో భక్తి పలవులు చిగిరించి చెలుని పాద
    పద్మములు అలుముకొని యా రాధనంబున మలయ మారుత వీచికలపై
    మలపు గొనుచు సమర్పణంబును సులలితముగా జేయ దొడగెను
    ||సంతో||

2.  పాపతాపము తొలగెను జీవితపు తుఫానులన్నియు నణగెను ప్రాచీన
    సర్పము పగబట్టి పడగెత్తి పంతమున ననుడాసి పటువున కఱవంగా
    పాప మరణపు విఱుగుడగునా ప్రభుని యమృత రక్తసారము ప్రాణ భిక్షను
    బెట్టెను మరి పగతుని యోడించె న హాహా
    ||సంతో||

3.  యాత్ర పథమున యేసుడు ప్రకాశింప రాత్రియె పగలాయెను నేత్రములు
    వికసింప ధాత్రి నా బసలోప విత్ర వాక్యములో వి చిత్ర కృపలను గాంచి
    గాత్ర వీణను మీటి దేవుని స్తోత్ర గీతము పాడి పుణ్య క్షేత్ర పథమున
    బోవ యేసుడు మిత్రుడై నడిపింప దొడగెను
    ||సంతో||

4.  సిరిసంపదలు యున్నను లేకున్నను కఱుణావరములు తరుగవు
    పైరు పంటలు గాని పరువు ప్రతిష్టలు కఱువైనగానినే మురియుదు
    మదిలోన గిరులపైనను పరుగు లిడుటకు హరిణ పాదము లొసగె యేసుడు
    వెఱతునా చింతింతునా క ల్వరిని ప్రేమలు కురియుచుండగ
    ||సంతో||

** ENGLISH LYRICS **

Santhoshimpare Priyulaara Yesuni Chentha Santhasimpare Manasaara
Entho Preminchi Ya Nanthu Dogenu Suthuni Vinthaga Brathukuva Santha
Shobhanu Daalche Antharangamulo Vasinchina Chintha Lellanu Vaada Baarenu
Ganthu Liduchunu Noothnajeeva La Thaanthamulu Pooyanga Dodagenu
||Santho||

1. Siluvalo Valaraarina Yesuniprema Phaliyinche Hrudhi Vanamuna
Kalusha Mellanu Baapu Kaluvarilo Bhakthi Palavulu Chigirinchi Cheluni Paadha
Padhmamulu Alumukoni Yaa Raadhanamuna Malaya Maarutha Veechikalapai
Malapu Gonuchu Samarpanambunu Sulalithamugaa Jeya Dodagenu
||Santho||

2. Paapathaapamu Tholagenu Jeevithapu Thufaanulanniyu Nananu Praacheena
Sarpamu Pagabatti Padageththi Panthamuna Nanudaasi Patuvuna Karavangaa
Paapa Maranapu Virugudagunaa Prabhuni Yamrutha Rakthasaaramu Praana Bhikshanu
Bettenu Mari Pagathuni Yodhinche Na Haahaa
||Santho||

3. Yaathra Pathamuna Yesudu Prakaashimpa Raathriye Pagalaayenu Nethramulu
Vikasimpa Dhaathri Naa Basalopa Vithra Vaakyamulo Vi Chithra Krupalanu Gaanchi
Gaathra Veenanu Meeti Dhaevuni Sthothra Geethamu Paadi Punya Kshethra Pathamuna
Bova Yesudu Mithrudai Nadipimpa Dodagenu
||Santho||

4. Sirisampadhalu Yunnanu Laekunnanu Karunaavaramulu Tharugavu
Pairu Pantalu Gaani Paruvu Prathishtalu Karuvainagaaninae Muriyudu
Madhiloona Girulapainanu Parugu Lidutaku Harina Paadhamu Losage Yesudu
Verathunaa Chinthinthunaa Ka Lvarini Premalu Kuriyuchundaga
||Santho||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------