3272) సహోదరులు ఐక్యత కల్గి వసించుట ఎంత మేలు

** TELUGU LYRICS **

    సహోదరులు ఐక్యత కల్గి వసించుట
    ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును

1.  అది అహరోను తలపై పోయబడియు
    క్రిందికి గడ్డముపై కారి - నట్టులుండును

2.  అంగీల అంచు వరకును దిగజారిన
    పరిమళ తైలమువలె - నదియుండును

3.  సీయోను కొండ మీదికి - దిగివచ్చునట్టి
    హెర్మోను మంచువలె నైక్యత యుండును

4.  ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చట
    యుండవలెనని యెహోవా సెలవిచ్చెను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------