2915) రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు


** TELUGU LYRICS **

రాజులకు రాజువు - ప్రభువులకు ప్రభుడవు 
నీవే నా విభుడవు - లోకాన ఘనుడవు (2) 
నీవే... నీవే... నీవే... నీవే... 
రాజా నా రాజా - యేసు రాజా (2) 
||రాజులకు||

రారు సరిరారు - మరి నీకెవ్వరూ 
లేరు సరిపోరు - మరి ఇంకెవ్వరూ (2) 
సర్వ సృష్టికర్తవు - సర్వోన్నతుడవు 
సర్వాధికారివి - సర్వాంతర్యామివి 
నీవే... నీవే... నీవే... నీవే... 
రాజా నా రాజా యేసు రాజా (2) 
||రాజులకు||

ఉన్నా నేనున్నా - అని అనువాడవు 
ఉన్న రానున్న ఏకైక రాజువు (2) 
అగ్ని జ్వాలలవంటి - కన్నులున్నవాడా 
మహా తేజస్సుతో - ప్రకాశించువాడా 
నీవే... నీవే... నీవే... నీవే... 
రాజా నా రాజా యేసు రాజా (2) 
||రాజులకు||

-----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee vunte Chaalunaya (నీ వుంటే చాలునయా)
-----------------------------------------------------------------------------