** TELUGU LYRICS **
రాజుల రాజువయ్యా - నీవే మా రాజువయ్యా
రాజాధి రాజువయ్యా - నీవే మహా రాజువయ్యా
ఇహలోకాన్ని పాలించే - నాధుడ నీవయ్యా (2)
మహిమయు ఘనతయు
ఇహమందు పరమందు చెల్లును (2)
||రాజుల||
నోటిమాటతో భూమిని చేసెన్
నేలమంటితో మనిషిని రూపించెన్
జీవము పోసి జీవాయువు నూదెన్
శూన్యములోనే సర్వసృష్టిని చేసెన్
మహిమయు ఘనతయు - ఇహమందు పరమందు చెల్లును (2)
స్తోత్రాలయ్యా...
||రాజుల||
నీ చెంగు ముట్టిన - స్వస్థత కలిగెన్
నీ చేయి తాకిన - శవములు లేచెన్
సాతాను శక్తులే - గడగడగడలాడెన్
నేనా దయ్యమే - గజగజగజ వణికెన్
మహిమయు ఘనతయు - యుగయుగములు నీకే చెల్లును (2)
హల్లెలూయా....
||రాజుల||
రాతిబండతో - దాహము తీర్చెన్
చేతికర్రతో - సంద్రాన్ని చీల్చెన్
రొట్టెను విరచి - వేవేలకు పంచెన్
ప్రాణాన్నిచ్చి - మాకు రక్షణ నిచ్చెన్
మహిమయు ఘనతయు - యుగయుగములు నీకే చెల్లును (2)
వందనమయ్యా....
||రాజుల||
-------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)
-------------------------------------------------------------------------------------