3472) హల్లెలుయ హొసన్నహొ జయజయ విజయమహొ

** TELUGU LYRICS ** 

    హల్లెలుయ హొసన్నహొ జయజయ విజయమహొ
    వ్యూహిత సైన్యమహొ సమభీకర రూపిణహొ
    మనసున భావమా మదినిల ధ్యానమా
    సుమముల హారమా పరిమళ హొమమా

1.  జన్మతొ పాపిని నా క్రియలతో దోషినైతీ
    మరువని మమకారం సిలువలో ఆ ప్రేమత్యాగం
    జివము సంపూర్ణం నా జననమే పరిపూర్ణం
    ఆత్మలో హర్షమా నీ మహిమలో తేజమా
    నీతియు మహిమయు కలిగెగా క్రీస్తులో
    కరుణయు కృపయును విరిగి దొరికె నిలలో

2.  అనుదిన జీవితం నా అనుక్షణ బలియాగం
    అమలుని అనురాగం దైవాత్మ పూర్ణాభిషేకం
    వాక్యమే ఆధారం రక్తమే పరిహారం
    ఆ వాక్యమే ఆధారం నీ రక్తమే పరిహారం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------