** TELUGU LYRICS **
హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ
కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము
గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును

||హలెలూయ||
1. హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ
శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక
పారిపోయెను గలిబి లాయెను నరకము
||హలెలూయ||
2. హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ
యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను
బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్

3. హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ
సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము
లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో

4. హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ
యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ
చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము

5. హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ
బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము
మిమ్ము నాయన కరుణతో నడుపును సదా

6. హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ
పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ
కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును

7. హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల
నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ
గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో

8. హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ
కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు
సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది

9. హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల
ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ
జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :